న్యూఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దారి మళ్లించాల్సి వచ్చింది. అత్యవసరంగా విమానాన్ని రష్యాలోని క్రాన్సోయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపేశారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రయాణికులు సిబ్బంది భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని రష్యాకు దారి మళ్లించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రయాణికుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యతని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa