లావేరు మండలం అదపాక జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై లారీ ఆర్టిసీ బస్సు ఢీకొనడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ ద్వారా సూచించారు.