నేడు 19వ తేదీ, శుక్రవారం ఉదయం మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వినుకొండలో పర్యటిస్తారు అని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. అయన మాట్లాడుతూ..... టీడీపీ కార్యకర్త చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడానికే, ఆయన రేపు వినుకొండలో పర్యటించనున్నారు.రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది, వందలాది ప్రజలు, పోలీసులు చూస్తుండగానే, వినుకొండ నడిరోడ్డులో మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం అంటే.. అంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.. ఇలా పార్టీ కార్యకర్తలను నరికి చంపడానికా?. వినుకొండలో తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయానికి బీజం వేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడన్న కారణంతోనే రషీద్‌ను దారుణంగా నరికి చంపారు.