వినుకొండలో జరిగిన హత్య ఒక రాజకీయ హత్య. అలాగే ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి అత్యంత హేయం అని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వినుకొండలో మా పార్టీ కార్యకర్తను అత్యంత పాశవికంగా హత్య చేసి, దాన్ని వ్యక్తిగత హత్యగా చిత్రీకరించడం దారుణం. టీడీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరు వెళ్లిన ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది?. ఏకంగా ఒక ఎంపీపైనే రాళ్లతో దాడి చేస్తున్నా, రక్షణ కల్పించకుండా పోలీసులు చోద్యం చూశారంటే, ఇక్కడ ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుంది అని అన్నారు.