రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు మార్క్ రాజకీయాలు నడుస్తున్నాయి అని మాజీ ఎమ్యెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అయన మాట్లాడుతూ.... శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, దొమ్మీలు ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. ఈ తరహా పద్ధతి మారకపోతే తిరగబడాల్సి వస్తుంది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి దారుణం. వెంటనే రాజ్యాంగ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. ఇకనైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలి అని హెచ్చరించారు.