పుంగనూరు నా ఇంటికి వచ్చిన ఎంపీ పి.మిధున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి అని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప తెలిపారు. అయన మాట్లాడుతూ.... మారణాయుధాలు, రాళ్లతో ఎంపీ మిథున్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. నా వాహనాలతో పాటు, మిథున్‌రెడ్డి వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. వారు టీడీపీ తొత్తులుగా వ్యవహరించారు అని తెలియజేసారు.