ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా టీడీపీ శ్రేణులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వినుకొండలో జరిగిన ఘటనతో దేశమంతా ఉలిక్కిపడిందన్న ఆయన.. రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. పార్టీ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.