చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయటమే తెలుగుదేశం కార్యకర్తలు పనిగా పెట్టుకున్నారు అని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వారు గాలికి వదిలేశారు. హత్య జరిగిన తరవాత అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్ని ఎస్పీ, పాతకక్షల వల్లే రషీద్ హత్య జరిగిందని చెప్పడం దారుణం అని అన్నారు.