అద్దంకి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి గురువారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన వెలుగు చూసింది. కుమారుడు చేసిన అప్పులు చెల్లించాలంటూ బాకీదారులు చేసే ఒత్తిడి తట్టుకోలేక ఆ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ఆయనను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa