కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరాలలో ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు అప్పలనాయుడుకి శుక్రవారం రణస్థలంలో క్యాంపు కార్యాలయం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు.బిజెపి ప్రభుత్వం వ్రాత పూర్వకమైన హామీలు ఇచ్చిందని,ఆ హామీ ఇంతవరకు అమలుకు తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు.