రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అందిస్తామన్న రూ. 20వేల పెట్టుబడి సాయాన్ని వెంటనే మంజూరు చేయాలని రైతు సంఘం మండల కార్యదర్శి రాజారామిరెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రి మండలంలోని చిన్నపోలమడ, యర్రగుంటపల్లి సచివాలయాల్లోని అధికారులకు వినతి పత్రం అందచేశారు. ఆయన మాట్లాడుతూ రైతులకు రూ. 2లక్షల రుణ మాఫీ చేయాలన్నారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులను మంజూరు చేయాలన్నారు.