శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదమైన రోడ్లు గత పాలకుల నిరక్ష్యానికి అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ మండలంలోని తంగివాని పేట నుంచి వానవాని పేట వరకు తారు రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు.