శ్రీకాకుళం కేంద్రమంత్రి కార్యాలయంలో ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పౌర విమాన యాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. రైతు చట్టాలు రద్దు సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు జరిగేందుకు కృషి చేయాలని వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఎస్ కే యం కన్వీనర్ తాండ్ర ప్రకాష్ రావు, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.