దేశంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేవీవీ ప్రసాద్, జీ. ఈశ్వరయ్య ఆరోపించారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని ఎన్జీవో హోంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేశ అధ్యక్షతన సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలు ఎండగట్టారన్నారు దేశంలో ప్రజా స్వేచ్ఛను హరిస్తున్నారని, ప్రశ్నించే గొంతుకలను అకారణంగా జైళ్లకు పంపుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్వేతపత్రాల విడుదల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాలయాపన చేస్తున్నారని విమర్శిం చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. గాలేరు-నగిరి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు పునర్నిర్మా ణానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో వామపక్షాలకు బలం తక్కువ ఉన్నా అనునిత్యం ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేసా ్తమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివారెడ్డి, జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు, సహాయ కార్యదర్శి మహేశ, జిల్లా కార్యవర్గ సభ్యుడు కృష్ణప్ప, మనోహర్‌రెడ్డి, సాంబశివ, సిద్దిగాళ్ల శ్రీనివాసులు, విశ్వనాథ్‌నాయక్, సుధీర్‌కుమార్, మురళి, సుమిత్రమ్మ, జ్యోతి, చిన్నయ్య, కోటేశ్వరరావు, వెంకటేశ తదితరులు పాల్గొన్నారు.