శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఏడు పంచాయతీల విలీనం ప్రక్రియ సరిగ్గా జరగలేదు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అయన మాట్లాడుతూ.... దీనివల్ల విలీన పంచాయతీల్లో ఉపాధి పనులకు ఆస్కారం లేకుండా పోయింది. విలీన ప్రక్రియను పునఃపరిశీలన చేసేలా అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. కేఆర్ స్టేడియం, ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని కోరుతాను. వంశధార, నాగావళి నదులు గార, శ్రీకాకుళం మండలాల్లో దిశలు మారిపోవడంతో సముద్రం వద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా పోయింది. అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావిస్తాను అని తెలిపారు.