పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. గతంలో నిర్మించిన అన్న క్యాంటీన్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి క్యాంటీన్లు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పేదలకు కడుపునిండా అన్నం పెట్టే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో అన్న క్యాంటీన్లను నిర్వహించారు. రూ.5కే భోజనం, అల్పాహారం అందించారు.