పుట్లూరు మండలంలోని ఏ. కొండాపురం గ్రామ శివారులోగల సబ్స్టేషన వద్ద శనివారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందా రు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణానికి చెందిన నీలకంఠ ఆచారి (46) పనినిమిత్తం కారులో అనంతపురానికి వెళ్లి తిరిగి స్వగ్రా నికి బయలుదేరాడు. ఏ. కొండాపురం వద్దకు రాగానే ఎదు రుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. నీలకంఠ ఆచారి గత ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. అతను పట్టణంలో బంగారుషాపు నిర్వహించడంతో పాటు ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య అనిత ఉంది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. భార్య ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హేమాద్రి తెలిపారు.