వంశధార కాలువలు ఆధునికీకరణ చేపట్టాలని అసెంబ్లీ సమావేశాలలో కోరుతాను అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. అయన మాట్లాడుతూ.... కరకట్ట పనులన్నింటినీ పూర్తిచేయాల్సి ఉంది. తాగునీరు, సాగునీరు సమస్యలు పరిష్కరించేందుకు పలు విషయాలను ప్రస్తావిస్తా. మరో ముఖ్యమైన అంశాన్ని అసెంబ్లీలో వెల్లడిస్తాను అని తెలిపారు.