కుందుర్పి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సోమవారం స్థానిక ప్రభుత్వ వైద్యాధికారిణి అనుషాదేవి సందర్శించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, రక్తహీనతకు గల కారణాలపై అవగాహన కల్పించారు. మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, రోజు పాలు త్రాగాలని, బయట దొరికే ఆపరిశుభ్రత ఆహారం తీసుకోకూడదని తెలిపారు. బాల్య వివాహాలు వలన జరిగే అనర్థాలను వివరించి విద్యార్థులను చైతన్యపరిచారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.