జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. రాజాం నియోజకవర్గంలో మంగళవారం బహిరంగ మార్కెట్ కి వెళ్లి ధరలను పరిశీలిస్తే ఏ కూరగాయల ధరలను చూసినా సామాన్య, మధ్యతరగతి ప్రజలను వణికిస్తున్నాయి. కిలో టమాట రూ. 80 పలుకుతుండగా మిగిలిన కూరగాయలు అయిన వంకాయలు, బీరకాయలు, బెండకాయలు తదితర ధరలు కిలో రూ. 60 వరకు పలుకుతున్నాయి. దీంతో కూరగాయలను కొనలేక సామాన్య మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.