రేగిడి మండలంలోని బొడ్డవలస, రేగిడి, కోర్నివెంకటాపురం తదితర నాగావళి నదీతీర గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణాపై పోలీసు పికెట్ ఏర్పాటు చేసారు. రేగిడి ఎస్సై శ్రీనివాసరావు, ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసారు. మంగళవారం ఎస్. ఐ మాట్లాడుతూ, అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు, ట్రాక్టర్లు, లారీలతో తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.