రాజాం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ అధికారులు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం మమ్మురంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది గ్రామాల్లో బ్లీచింగ్ సున్నం మిశ్రమాన్ని చల్లుతున్నారు. ఈగలు, దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. పారిశుద్ధ్య పనులలో శానిటేషన్ సిబ్బంది అశ్రద్ధ వహించవద్దని కమిషనర్ హెచ్చరించారు.