కోడిరామూర్తి నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించి, వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక కోడి రామమూర్తి మైదానం నిర్మాణం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. వర్షం కారణంగా పనులు ఇంకా ప్రారంభించలేదని కాంట్రాక్టర్ కలెక్టర్ కు వివరించారు. పనులకు సంబంధించి ఏఏ మెటీరియల్ ఎక్కడ నుండి వస్తున్నదీ తెలియజేయాలని ఎఈఈని ఆదేశించారు.