ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ హత్యలు, విధ్వంసాలపై వైయస్ఆర్సీపీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గళం విప్పింది. ఈ ధర్నాలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..... రాష్ట్రంలో అరాచకం తాండవిస్తోంది. రాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి. వెయ్యికిపైగా దాడులు జరిగాయి. 300 మందిపై హత్యాయత్నాలు కూడా చేశారు ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. వైయస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారు. నిన్న కూడా వైయస్ఆర్సీపీ నేతపై దాడి జరిగింది. ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారు.. ఈ అరాచకాలను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకే ధర్నా చేస్తున్నామని పేర్కొన్నారు.