బడ్జెట్లో అంతా ప్రచార హడవిడి తప్ప రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని వైయస్ఆర్సీపీ విమర్శించింది. గతంలో ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారాలే చేసుకుని డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేసింది. 2016 సెప్టెంబర్‌లో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి అంగీకరించడం ద్వారా చంద్రబాబు ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని మండిపడింది. ‘అర్ధరాత్రి అద్భుత ప్రకటన అంటూ నానా హడావిడి చేశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం స్వర్గం అవుతుందా?’ అంటూ రాష్ట్రం హక్కుపై సీఎం హోదాలో చంద్రబాబు తన చేతులతో తానే నీళ్లు చల్లారని మండిపడింది. ఈ మేరకు బడ్జెట్‌పై మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.