ఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ నేత నదిముల్‌హక్ మాట్లాడుతూ..... నేను బెంగాల్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూసి, షాక్ తిన్నాను. రాష్ట్రంలో ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరిగాయో చూస్తే, బా«ధ అనిపిస్తోంది. ఇళ్లపై దాడులు చేశారు. ఆ ఘటనలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేంద్రం సుమోటోగా చర్య తీసుకోవాలి. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చక్కదిద్దాలి. మేము జగన్‌గారికి, రాష్ట్ర ప్రజలకు అండగా, తోడుగా నిలబడతాము అని భరోసా కల్పించారు.