ఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా పాల్గొన్న శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.... ఎన్నికల తరవాత ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో.. అన్న విషయాలు చూపారు. మాకు చాలా ఆవేదన కలిగింది. రాష్ట్రాల్లో ఏం జరిగినా, ఢిల్లీకి పట్టదు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, ఎప్పుడూ, ఎక్కడా చోటు చేసుకోవడం ఏ మాత్రం సరి కాదు. ఇలాంటి వాటిని మేము కచ్చితంగా వ్యతిరేకిస్తాము. జగన్‌గారు, మేమంతా మీకు ఒకే భరోసా ఇస్తున్నాము. ఎక్కడైతే వ్యవస్థలపై దాడులు జరుగుతాయో, పార్టీలపై దౌర్జన్యాలు కొనసాగుతాయో.. ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందో.. ఇండియా కూటమి అక్కడ నిలబడి పోరాడుతుంది. భుజం భుజం కలిపి పని చేస్తుంది. ఎందుకంటే, ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ పోరాటమే కాదు.. మీ పార్టీ కార్యకర్తలకు సంబంధించింది మాత్రమే కాదు.. ఎక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా.. ఇది ఏ ఒక్కరికి మంచిది కాదు. అందుకే మేము అండగా నిలుస్తాము. సుప్రీం కోర్టు సుమోటోగా కేసు స్వీకరించాలి అని డిమాండ్ చేసారు.