ఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా పాల్గొన్న రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ..... ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనల వీడియోలు చూసిన తరవాత, నాకు ఒక్కటే అనిపించింది. స్వతంత్య్ర భారతావనిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీసం వాటిని ఊహించలేము. మరి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఏమైంది? గవర్నర్ ఏం చేస్తున్నారు?రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. విపక్ష పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారు. వారిపై దాడి చేస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి, టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. అందుకే నేను కేంద్రాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి అని డిమాండ్ చేసారు.