మహానంది సమీపంలోని చెంచులక్ష్మి గిరిజన గూడెంలో గిరిజనుల సమస్యలను నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలుసుకున్నారు. మండల యంత్రాంగంతో కలిసి గురువారం చెంచుగూడెం సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. గూడెంలో మౌలిక వసతులు కల్పిస్తానని, ఇంటి పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు గూడెం పెద్ద శ్రీనివాసులు తెలిపారు. గూడెం అభివృద్ధికి అధికారులతో చర్చించినట్లు తెలిపారు.