మహానంది పుణ్య క్షేత్రం భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. శుక్రవారం క్షేత్ర పరిసర ప్రాంతాల్లో భక్తులు లేక బోసిపోయింది. ప్రతినిత్యం భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్ల దర్శనానికి వస్తుంటారు. కానీ ఆషాడ మాసం కావడంతో భక్తులు లేక క్షేత్రమంతా నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. దీనికి తోడు పులి సంచారం కలకలంతో, క్షేత్రానికి భక్తులు కరవయ్యారు.