ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వత కేంద్రానికి కీలక విజ్ఞప్తి పెట్టింది. ఐపీఎస్ కేడర్‌ను పెంచాలని కోరింది. దాంతో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.ఐపీఎస్ కేడర్ సంఖ్యను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే భారీగా ఏపికి కొత్త ఐపీఎస్‌లు రాబోతున్నారు. ప్రస్తుతం 144 మంది ఐపీఎస్‌లు ఉండగా.. వారి సంఖ్యను 174కి పెంచింది కేంద్ర ప్రభుత్వం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎస్‌లను కేటాయించారు. కానీ.. ఐపీఎస్ అధికారులు ఏపీకి సరిపోలేదు.దీంతోపాటు నిఘా వ్యవస్థ విభాగాల్లో, క్రైమ్ విభాగాల్లో పోలీసు అధికారుల కొరత తీవ్రంగా మారింది.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని కోరారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఐపీఎస్‌ల కొరత గురించి మరోసారి ప్రస్తావించారు. హోంమంత్రి అమిత్‌షా అన్ని విషయాలను చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నాలుగైదు సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్ ఐపీఎస్‌లనే ఎస్పీలుగా నియమించాల్సి వస్తుందని తెలిపారు.సీఎం చంద్రబాబు వినతిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఐపీఎస్ కేడర్‌ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.