కోవెలకుంట్లకు చెందిన ఓ యువకుడు ముంబైలో ప్రమాదవశాత్తు రైలులో నుంచి కింద పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన వాసగిరి రామసుబ్బయ్య, భ్రమరాంబ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద కుమారుడు వీఎస్ రజనీకాంత్ అనే యువకుడు మద్రాసులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెకండియర్ చదువుతుండగా ముంబైలో క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సాధించాడు. నెల రోజుల క్రితం ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తుం డేవాడు. అందులో భాగంగానే ఈ నెల 25న ముంబైలో ఆఫీసు నుంచి సైట్కు వెళ్లేందుకు రైలు ఎక్కాడు. మంది ఎక్కువగా ఉండడంతో రైలు డోరు వద్దనే నిలబడ్డాడు. రైలు వెళ్తుం డగా ప్రమా దవశాత్తు చేయి జారి కింద పడడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి రామసుబ్బయ్య బంధువు లతో కలిసి అక్క డకి వెళ్లి రజనీకాంత్ మృత దేహాన్ని కోవెలకుంట్లకు తీసుకువచ్చాడు. శని వారం అంత్యక్రియలు నిర్వహించారు. చేతికం దిన కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.