రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికే అర్ధం మార్చిన చంద్రబాబు.. రాష్ట్రాభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, తామేం చేయబోతున్నామో చెప్పకుండా.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తూ.. వైట్పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించారు. ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్.. అమలుకు ముందే, తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.