ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యసాయి జిల్లా పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ పెన్షన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి సవిత ఆదేశించారు.