శ్రీకాకుళం జిల్లా, రణస్థలం జేఆర్ పురం పంచాయతీ పరిధిలోని సీతం వలస గ్రామానికి చెందిన ధర్మాన రమేష్ (21) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు కథనం మేరకు కుటుంబ కలహాల మేరకు శనివారం గ్రామానికి సమీపాన ఉన్న ఒక తోటలో ధర్మాన రమేష్ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు ఈ ఘటనను చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. రమేష్‌కు తండ్రి, తల్లితోపాటు సోదరుడు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి, తండ్రి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్ఐ గోవిందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నారు.