ధర్మవరం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో వెలసిన లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మూడో శనివారం ఏడు శనివారాల వ్రతాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రాజేశ స్వామి మూల విరాట్టును పట్టువస్ర్తాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం మహిళల చేత ఏడు శనివారాల వ్రతం చేయించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నంశెట్టి జగదీశ్వర ప్రసాద్, ప్రధానకార్యదర్శి జింకా రాజేంద్ర ప్రసాద్, సభ్యులు చెన్నంశెట్టి శ్రీనివాసులు, చెన్నంశెట్టి రమేశ పాల్గొన్నారు.