ఏపీలో వైసీపీ ఓడింది. కానీ ఆ పార్టీ ఈ రోజుకీ బలమైన ప్రత్యర్థిగానే ఉంది. వైసీపీని దెబ్బకొట్టాలని టీడీపీ-జనసేన చూస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖను ఎంచుకోవడం వెనక గ్రామాల్లో తమ పార్టీని పటిష్టం చేసుకోవడానికే అని తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీ కీలక నేతలంతా టీడీపీలో లేదా జనసేనలో చేరేలా చంద్రబాబు పథక రచన చేస్తున్నారట.