తిరుమలకు వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో చీరాలకు చెందిన భక్తుడు నాగేంద్ర (29) ఆదివారం పాముకాటుకు గురయ్యాడు. నాగేంద్ర తన స్నేహితులతో కలిసి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళుతుండగా మార్గమధ్యంలో 7వ మైలు దాటిన తర్వాత ఓ టీ స్టాల్ వద్ద పాము కాటేసింది. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు వెంటనే అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa