ఏపీ మాజీసీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రధాని పొగడ్తలతో ముంచెత్తారు.ఇంతకీ జగన్‌ని ప్రధాని మోడీ ప్రశంసించింది ఎక్కడో తెలుసా… నీతి ఆయోగ్ సమావేశంలో.2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అనే ఉద్దేశమే ప్రధాన అజెండాగా వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ప్రధాని మోడీ జగన్‌ని ఓ స్కీమ్ విషయమై ప్రశంసించారు.భారత్ అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా 5 అంశాలపై ఫోకస్ పెట్టాలని ప్రధాని మోదీ సీఎంలను కోరారు.తాగునీరు, ఎలక్ట్రిసిటీ, హెల్త్ కేర్, విద్య,భూమి….ఈ ఐదు అంశాలపై అన్ని రాష్ట్రాలూ ఫోకస్ పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులకు సూచించారు.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్‌తో వచ్చాయనీ, మరికొన్ని రెడీ చేస్తున్నాయనీ, మొత్తంగా అన్ని రాష్ట్రాలూ దీన్ని అమలు చెయ్యాలని కోరారు.కాగా నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ.. 5 అంశాలను ప్రస్తావిస్తూ.. అందులో ఒకటైన హెల్త్ కేర్ గురించి మాట్లాడారు.హెల్త్ విషయంలో పలు రాష్ట్రాలు అమలుచేస్తున్న, చేసిన పథకాలను ప్రస్తావించారు.వాటిలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను మోడీ మెచ్చుకున్నారు.వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇంలాటి పథకం వలన ప్రజలకు వైద్యం చేరువ అవుతుందనీ చెప్తూ అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలు కావాలని ఆకాంక్షించారు