ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో పురోగతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 28, 2024, 07:53 PM

 


ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్‌ ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని నాలుగు పెట్టెల దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు చెందిన ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపి నివేదికను అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో మూడు శాఖలకు చెందిన అధికారులు వారం రోజులుగా కేసును ఛేదించేందుకు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారు.హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో మాజీ ఎమ్మెల్యే ఇంట్లో నివాసముంటున్న. శశిధర్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 8 గంటల పాటు సోదాలు చేసి, విచారించి అతడి ఇంట్లో ఉన్న నాలుగు పెట్టెల దస్త్రాలను వెంట తీసుకొని వెళ్లారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com