మాజీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన నేత నాగబాబు మరోసారి సెటైర్లు వేశారు. జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ఎద్దేవా చేశారు.ఎందుకంటే 2019 లో శ్రీను అనే వ్యక్తి జగన్‌పై కోడికత్తితో దాడి చేశాడని.. ఐదేళ్లు అయిన కూడా ఆ కేస్ ఇంకా కొలిక్కి రాలేదని గుర్తు చేశారు. అప్పుడంటే జగన్‌కు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు కుదర్లేదని అన్నారు. ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉందని తెలిపారు. . ఈ కేసును తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి జగన్ మోహన్ రెడ్డికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరారు