రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపిక విధానంలో మార్పు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ అన్నారు. ఆయన సోమవారం అనంతపురంలో మాట్లాడుతూ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కి లేఖ రాశానని తెలిపారు. సీనియర్ విద్యాశాఖ అధికారులతో పరిశీలన చేసి వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పేర్లను ప్రతి పాదించాలని అన్నారు.