శింగనమల మండలం జూలకాలువ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక టిప్పర్లను సీజ్ చేసినట్లు సోమవారం శింగనమల ఎస్సై చంద్రశేఖర్ తెలియజేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శింగనమల మండల వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణా కొనసాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.