వైకాపా ప్రభుత్వంలో టిడిపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సోమవారం కడపలో కర్నూలు రేంజ్ డి ఐ జి కోయ ప్రవీణ్ అధికారికి మర్యాదపూర్వకంగా కలిసి వివరించానని ఉమ్మడి కడప జిల్లా మాజీ తెలుగు యువత ఉపాధ్యక్షులు కుప్పాల వెంకటసుబ్బయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు టిడిపి సీనియర్ నేత హరిప్రసాద్, బండి బాబు తదితరులు పాల్గొన్నారు.