నంద్యాల స్థానిక టిడిపి కార్యాలయం నందు నిర్వహించిన మన ఊరు -- మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి ప్రజలు తమ సమస్యలను తెలుపుకుంటూ అర్జీలను సోమవారం సమర్పించారు. వెంటనే స్పందించిన ఫరూక్ అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే టిడిపి లక్ష్యమని అన్నారు.