కేరళలోని వయనాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో 47 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు మోదీ తెలిపారు.మరోవైపు ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందినవారికి పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్ కింద రూ.2 లక్షలు పరిహారం చెల్లిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. క్షతగాత్రులకు రూ.50,000 ఇవ్వనున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa