తాళం వేసి ఉన్న ఇంట్లో తాళం పగులగొట్టి ప్రవేశించి నగదు, వెండితో ఉడాయించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా, గంపలగూడెం లో సోమవారం వెలుగు చూసింది. గోసవీడుకు చెందిన నేరెళ్ల సుభాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 26న తిరుపతికి వెళ్లాడు. సోమ వారం ఇంటికి రాగా ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఇంటి వెనుక వైపు తలుపు తాళం పగులకొట్టి ఇంట్లో ఉన్న రూ.1.44 లక్షల విలు వైన వెండి పూజా సామగ్రి, రూ.80 వేల నగదుతో పరారైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై శ్రీను ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.