షాపింగ్‌మాల్స్‌ను భారీ నగరాలకు పరిమితం చేసేలా ప్రభుత్వంతో మాట్లాడాలని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను రెడీమేడ్ అండ్ గార్మెంట్స్ వ్యాపారులు కోరారు. జగ్గయ్యపేటలో షాపింగ్ మాల్స్‌కు వ్యతిరేకంగా వ్యాపారులు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. నల్లబ్యాడ్జీలు ధరించిన నెహ్రూచౌక్ నుంచి ప్రదర్శనగా వచ్చి ఎమ్మెల్యేకు సమస్యను వివరించారు. 60వేల జనాభా ఉన్న జగ్గయ్యపేటలో వస్త్ర వ్యాపారానికి షాపింగ్ మాల్స్ వల్ల 60-70 మంది చిరువ్యాపారులు వ్యాపారాలు దెబ్బతిని, ఆర్థికంగా నష్టపోతున్నారని మర్చంట్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు మద్దుల ఉమామహేశ్వరరావు, కార్యదర్శి నరేంద్ర, కోశాధికారి వి.మహేష్ ఆవేదన వెల్లిబుచ్చారు. వారంలో నాలుగు రెడీమేడ్ దుకాణాలు తీసేశారని, వ్యాపారులకు ఇక ఆత్మహత్యలే శరణ్యమన్నారు. సమస్యపై ప్రభుత్వానికి సూచనలు చేస్తానని తాతయ్య వారికి హామీ ఇచ్చారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వ్యాపారులు వినతి పత్రం అందించారు.