హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై విజయవాడ, గుంటుపల్లి సీఏ కన్వెషన్ వద్ద సోమవారం మోటార్ బైక్‌ను వెనుక నుంచి వస్తున్న టాటా బొలెరో వాహనం ఢీ కొనడంతో హోం గార్డు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం ఎ.కాలనీకి చెందిన కూనపరెడ్డి కృష్ణ (40) ఆరేళ్లుగా జి.కొండూరులో హోంగార్డుగా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బైక్‌పై విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా టాటా బొలెరో ఢీ కొనడంతో అతని తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బాధిత కుటుంబాన్ని డీసీపీ హరికృష్ణ, మైలవరం సీఐ కిషోర్‌బాబు, జి.కొండూరు ఎస్సై షబ్బీర్ అహమ్మద్, హోంగార్డు ఆర్లు పరామర్శించి దైర్యం చెప్పారు.