ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది విభజన చట్టంలో ఇచ్చిన హామీయేనని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలూ ప్రత్యేక హోదా ఇస్తామన్నాయని తెలిపారు. సోమవారం నాడు ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... హోదాకు బదులు ప్యాకేజీ అన్నది సరికాదు, ప్యాకేజీ హోదాతో సరిపోదని స్పష్టం చేశారు.